ఆద్య ..పవన్ కళ్యాణ్ కూతురు బయట పెద్దగా కనిపించదు. చాలా సైలెంట్ ఎప్పుడూ అమ్మ పక్కనే ఉంటుంది .. తన పని తాను చూసుకుపోతూ ఉంటుంది . అయితే పవన్ కళ్యాణ్ ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. అకిరా కూడా చాలా సైలెంట్ గా ఉంటారు . మరి పవన్ కళ్యాణ్ కూతురు కొడుకు అయిన అకిరా -ఆద్య ఎందుకు అంత సైలెంట్ గా ఉంటారు..? జనాలతో మింగిల్ అవ్వరు అనే డౌట్ అందరికీ ఉంటుంది .
కానీ అది తప్పు అని ప్రూవ్ చేసింది ఆధ్యా. నేను కూడా అల్లరి పిల్ల నే అంటూ ప్రూవ్ చేసింది. ప్రమాణ స్వీకారోత్సవానికి చిరంజీవి ఫ్యామిలీతో పాటు కలిసి నిన్న రాత్రి గన్నవరం చేరుకున్నారు అకీరా – ఆద్య . ఈ క్రమంలోనే అక్కడ ఫ్యాన్స్ అరుపులు కేకలతో హోరెత్తించారు . అప్పుడు ఆద్య చిరునవ్వులతో ఉన్న పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ఆద్య కూడా అల్లరి చేసింది. దీంతో ఆద్య అల్లరి పిల్ల అని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు .
అంతేకాదు ఆధ్య కొద్దిసేపటి క్రితమే తన తల్లి రేణు దేశాయితో వీడియో కాల్ మాట్లాడింది. ఈ క్రమంలోనే నాన్న ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా చాలా పద్ధతిగా రెడీ అయింది . దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది . ఇప్పుడు ఆ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. మొదటినుంచి ఆద్యాని మనం చాలా సైలెంట్ గానే చూసేవాళ్లం.. ఫర్ ద ఫస్ట్ టైం ఆధ్యా అల్లరి వేషాలు కూడా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కూతురు అంటే ఆ మాత్రం నాటినెస్ ఉండాలి అంటున్నారు పవన్ అభిమానులు. ఆద్య ను అదేవిధంగా అఖీరానందన్ కు సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!!