భరతనాట్యం డ్రెస్ లో క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ ఫోటోలో భరతనాట్యం కాస్ట్యూమ్‌తో బుట్ట బొమ్మలా కనిపిస్తున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ హీరోయిన్. బిగినింగ్ లో ప్రాధాన్యత లేని పాత్రలో మాత్రమే నటించిన ఈ అమ్మడు.. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోను మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ ఐశ్వర్య మీనన్. తమిళనాడులో ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కదలిల్ సోదప్పవద్దు సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది.

ISWARYA MENON (@iswaryaamenonn) • Instagram photos and videos

కొంతకాలం సపోర్టింగ్ రోజులో నటించిన ఈ అమ్మడు.. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో హీరోయిన్గా మారింది. నిఖిల్ సిద్ధార్థ హీరోగా వ‌చ్చిన‌ స్పై సినిమాలోను ప్రేక్షకులకు కనిపించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఊహించిన రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ అమ్మ‌డు మరోసారి యంగ్ హీరో కార్తికేయ భజే వాయువేగం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్, కార్తికేయ తో రొమాన్స్ చేసింది. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Actress Aishwarya Menon Stills | Dehati girl photo, Teen girl dresses, Beauty full girl

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈమె భరతనాట్యం డ్యాన్సర్ అని.. చదువుకునే రోజుల్లోనే ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించింది అంటూ వివరించింది. అంతేకాదు తెలుగులో ప్రస్తుతం ఈమె మూడు సినిమాల్లో నటించనుంది అంటూ వివరించింది. ఒకటి ఆల్రెడీ అనౌన్స్ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమయ్యారని.. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు వివరించింది. అలాగే తమిళ్ లోను రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో ఈ అమ్మడు నటిస్తోందట.