వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా స్టార్ డైరెక్టర్ క్రిష్.. మరి డైరెక్టర్ ఎవరంటే..?!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు కరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ చేకూరి, డాక్టర్.విజయేంద్ర రెడ్డి తీగల సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న క్రిష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడట. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి కృష్ తప్పుకోవడంతో నిన్న మొన్నటి వరకు వార్తలు తెగ అయినా సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని ఇప్పుడు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గా ఎం. ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ కంప్లీట్ చేయనన్నాడు.

అయితే తాజాగా వరుణ్ తేజ్ తో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను తెర‌కెక్కించడానికి క్రిష్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు క్రిష్ ప్రొడ్యూసర్ గా వివరించనున్నాడట. ఇంతకీ ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా.. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఫేమ్ మేర్ల‌పాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.