‘ బేబీ ‘ మూవీలో హీరోయిన్ నేనే.. డైరెక్టర్ నన్ను మోసం చేశాడు.. గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్ వైరల్..?!

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బేబీ. గతేడాది థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో తెలిసింది. సాయిరాజేష్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా కాపీ అంటూ షార్ట్ ఫిల్మ్‌ డైరెక్టర్ సిరిన్ శ్రీరామ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సింది నేనేనని.. డైరెక్టర్ నన్ను మోసం చేశారంటూ వివరించింది గాయత్రి గుప్తా. ఇటీవల ఓ వీడియోలో గాయత్రి గుప్తా బేబీ సినిమా గురించి ప్రస్తావించి షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. బేబీ మూవీ ఆమె స్నేహితుడు సిరిన్‌ శ్రీరామ్ రాసుకున్న కథ అని.. కాపీ చేసి తీశార‌ని వివ‌రించింది.

Baby Movie Review Rating Story Cast and Crew

అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నన్నే తీసుకోవాలని సిరిన్ భావించాడని.. దానికి స్కూల్ అమ్మాయిల తాను కనిపించాలని సెట్ అవుతుందో లేదో అని కాస్ట్యూమ్ తో లుక్‌ చెక్ చేసాడ‌ని. ఇప్పటికి నా దగ్గర ఆ ఫొటోస్ ఉన్నాయంటూ ఫొటోస్ లీక్ చేసింది. అయితే కథ బాగానే ఉంది నీకు ఓకేనా అని గాయత్రి గుప్తాను సిరిన్ అడిగారని దానికి గాయత్రి గుప్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. అయితే ఈ కథకు ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టి సీరిన్ శ్రీరామ్, సాయి రాజేష్ కు వివరించాడని.. త‌న లుక్ టెస్ట్ పిక్స్‌కూడా ఆయ‌న‌కు రిఫ‌రెన్స్ చూపించామ‌ని చివ‌ర‌కు మెత్తం కాస్ట్యూమ్ కూడా రిఫ‌ర‌న్స్ పిక్ నుంచి కాపీ చేసి బేబీ టైటిల్ తో తెర‌కెక్కించాడని వివరించింది. ఇది వాస్తవ కథను బేస్ చేసుకుని రాసిన స్టోరీ.. కాంచి లో జరిగిన ఓ నిజమైన కథను బేస్ చేసుకుని రెండు సంవ‌త్స‌రాలు శ్ర‌మించి ఈ స్టోరీ సిరిన్ రాశాడ‌ని చెప్పుకొచ్చింది.

ఉన్న స్టోరీని ఉన్నట్టు సాయి రాజేష్ కాపీ చేశాడంటూ వివరించింది. అలాగే సాయిరాజ్ డైరెక్షన్లో గాయత్రి గుప్తా కొబ్బరి మట్ట సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనకు రూ.3 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తానని నన్ను మోసం చేశాడని.. కేవలం పాతికవేల మాత్రమే అందించాడని.. ఈ సినిమా కోసం ఫిజికల్ స్ట్రెస్ తో పాటు ఎంతో మానసిక వేదన కూడా ఫేస్ చేశానంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ బేబీ సినిమాల్లో జరిగిన స్కామ్ గురించి పూర్తిగా తెలియాలంటే బేబీ లీక్స్ డాట్ కామ్ అనే లింక్‌ ద్వారా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం గాయత్రి గుప్తా చేసిన కామెంట్స్ నెట్టింటే వైరల్‌గా మార‌డంతో వాట్ మొదట వైష్ణవి చైతన్య పాత్రలో గాయత్రి గుప్తను హీరోయిన్గా భావించారా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.