ఫైనల్లీ ..అభిమానుల కోరిక తీర్చబోతున్న డార్లింగ్ ప్రభాస్.. ఈసారి మోసం చేయవు కదా బాసు..!?

పాపం ఎప్పుడు కూడా తన సినిమా ప్రమోషన్స్ విషయానికి తన పర్సనల్ లైఫ్ ని యూస్ చేసుకొని ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం కల్కి సినిమా కోసం కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని వాడుకున్నాడు ప్రభాస్ . అప్పటినుంచి రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ ఏ పోస్ట్ చేసిన నమ్మేస్థితిలో లేరు .. మనకు తెలిసిందే కల్కి సినిమాలో ప్రభాస్ బుజ్జి పాత్రను ఇంట్రడ్యూస్ చేసే ముందు నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒకే ఒక్క పోస్ట్ చేశాడు.

ఆ పోస్టుతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. పాన్ ఇండియా వైడ్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు వైరల్ అయ్యాయి . సీన్ కట్ చేస్తే అదంతా బుజ్జి క్యారెక్టర్ కోసం అన్న విషయం బయటపడింది . అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ ఫైనల్లీ అభిమానుల కోరిక తీర్చబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉంటున్నాడో మనకు తెలిసిందే.

కాగా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక లవబుల్ లవ్ స్టోరీని ఓకే చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సాయి పల్లవి పర్ఫామెన్స్ బాగుంటుంది అని ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటే హైట్ ప్రాబ్లమ్ అని ఓపెన్ గా చెప్పుకు వచ్చాడు ప్రభాస్ . అయితే ఇది పూర్తి లవ్ సినిమాకి రిలేటెడ్ గా ఉండడంతో హనురాగవపూడి ట్రెడిషనల్ హీరోయిన్ కావాలి అని మొండి పట్టుదల పట్టడంతో ఫైనల్లీ ప్రభాస్ ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని ఓకే చేశారట.

దీంతో కోట్లాదిమంది రెబల్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన ఆ మూమెంట్ రాబోతుంది అంటూ పండగ చేసుకుంటున్నారు . అయితే ఈసారైనా ఒప్పుకుంటావా ..? లాస్ట్ లో హ్యాండ్ ఇస్తావా అంటూ జనాలు పరోక్షకంగా ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ ని గుర్తు చేసుకుంటున్నారు . మొత్తానికి ప్రభాస్ ఏదో మాయ చేసే విధంగానే ఉన్నాడు..!!