కన్న కొడుకు మహేష్ ని కాదని వెయ్యికోట్ల ఆస్తి అతనికి రాసిచ్చిన కృష్ణ.. మ్యాటర్ ఏంటంటే..?!

సూపర్ స్టార్ కృష్ణ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు. తేనెమనసులు సినిమాతో కృష్ణకు మొదటి హిట్ అందింది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన కృష్ణ.. తెలుగు సినిమాకు ఎన్నో కొత్త పంతులు నేర్పించారు. నటుడిగా, దర్శకుడుగా, నిర్మాతగా అన్నిరంగాల‌లో తన ప్రతిభను చాటుకున్న కృష్ణ.. పద్మాలయ స్టూడియోస్ ను నిర్మించి నిర్మాతగా ఎన్నో భాషల్లో 50 కి పైగా సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఈయ‌న ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొన్నాడు. లక్షల్లో లాభాలు అదే సమయంలో.. అంతే నష్టాలను కూడా చెవి చూసాడు.

Mahesh Babu's sibling Ramesh Babu dies of liver-related  complication-Telangana Today

సంపాదించిన డబ్బంతా సినిమాల్లో పెట్టేవారు. ఆయన సినీ కెరీర్లో మొత్తం 350 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. స్టార్ హీరోగా ఆయన బాగా సంపాదించుకున్నాడు. అయితే కృష్ణ ఆస్తులు ఎవరికి దక్కై అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. తాజాగా కృష్ణ అస్తులకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. కృష్ణకు ఇద్దరు భార్యలున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య ఇందిరా దేవికి రమేష్ బాబు, మ‌హేష్ బాబు ఇద్దరు కుమారులు. రెండో భార్య విజయనిర్మల కుమారుడు నరేష్ కృష్ణకు దత్త పుత్రుడు అవుతాడు. కృష్ణ సంపాదించిన ఓ వెయ్యి కోట్లకు పైగా విలువైన ఆస్తిని నరేష్‌కు ఆయ‌న‌ రాసిచినట్లు తెలుస్తుంది. నాన్నక్ రామ్ గూడలో ఉన్న 12 ఎకరాల స్థలం నరేష్ పేరును ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

కృష్ణ విజయ నిర్మల కట్టిన ఆ ఇంటి పై మహేష్ బాబు కి హక్కు ఉందా లేదా

నాన్నక్ రామ్ గూడాలో కృష్ణ, విజయనిర్మల 12 ఎకరాలు కొనుగోలు చేశారట. అప్పట్లో ఎకరం ఖరీదు రూ. 1.3లక్షలు ఉంటే.. ప్రస్తుతం దాని మార్కెట్లో ఎక‌రం రూ.100 కోట్లు ఉందని.. 12 ఎకరాలకు రూ.1000 కోట్లకు పైగా డబ్బు వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ స్థలాన్ని కొన్న తర్వాత కృష్ణ, విజయనిర్మల ఇక్కడకు వచ్చేసారు. నరేష్ మొదటి నుంచి కృష్ణ, విజయనిర్మలతో కలిసి ఉంటారు. ఈ క్ర‌మంలో ఆ 12 ఎకరాలు నరేష్ కు కృష్ణ రాసి ఇచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణ మిగిలిన ఆస్తులు రమేష్, మ‌హేష్‌లకు స‌మానంగా వెళాయ‌ట‌. కృష్ణ.. విజయనిర్మలకు చెందిన ఉమ్మడి ఆస్తి మాత్రం నరేష్ కు ఇచ్చారని సమాచారం. నా ఆస్తి వెయ్యి కోట్లు అంటూ నరేష్ కూడా పలుసార్లు ఓపెన్ గా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.