వామ్మో..పెద్ద పెద్ద రెస్టారెంట్ లో సాస్,చెట్నీలను ఇలా స్టోర్ చేస్తారా..? బయటపడ్డ భయంకరమైన (వీడియో)..!

ఈ మధ్యకాలంలో జనాభా ఇంట్లో వండుకొని తినడం కంటే బయట రెస్టారెంట్ లో నుంచి ఆర్డర్ చేసుకోవడం .. లేదా రెస్టారెంట్ ఫుడ్స్ ఇష్టంగా తినడం .. రెస్టారెంట్ కు వెళ్లి ఫుల్ గా కుమ్మేయడం లాంటివి చేస్తున్నారు . మరి ముఖ్యంగా సిటీస్లో ఉండేవాళ్లు ఇలాంటివి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అందుకే సిటీస్లో హోటల్స్ సంఖ్య కూడా ఎక్కువగా పెరిగిపోతుంది . కాస్ట్ ఎంత ఎక్కువైనా సరే హోటల్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు జనాభా .

అయితే అలాంటి జనాభాకు చెమటలు పట్టించే న్యూస్ ఇది అని చెప్పాలి . రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది. హైదరాబాద్ బేగంపేట్ ఏరియా లోని ఓ ప్రముఖ హోటల్లో ఇది జరిగినట్లు తెలుస్తుంది . ఆ వీడియోలో హోటల్ సిబ్బంది ఒకరు కస్టమర్లు తినేసి మిగిలిపోయిన టమాటా సాస్ ను చట్నీలను కిచెన్ లోకి తీసుకొస్తాడు. అంతేకాదు వాటిని మరో గిన్నెలో వేసి తీసుకెళ్లి జాగ్రత్తగా ఫ్రిజ్లో పెడతాడు .

అంతే కాదు ఆ తర్వాత మిగిలిపోయిన చట్నీలను సాస్ లను మరుసటి రోజు ఉపయోగిస్తారు అంటూ జనాల మాటల ద్వారా తెలుస్తుంది. ఒకరు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తాలూకా సాస్ అలాగే చట్నీలు మిగిలిపోయినప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా అదే తీసుకొచ్చి ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు పక్క కస్టమర్లకు సెర్వ్ చేస్తూ ఉంటారు అంటూ ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది . ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు. మనం హోటల్ లో లొట్టలు వేసుకుంటూ తినే సాస్ చట్నీ ఇలా చేస్తారా ..? ఈ విధంగా స్టోరేజ్ పెడతారా అంటూ ఫైర్ అయిపోతున్నారు . ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!