జలుబు-దగ్గుకు అలాంటి మెడిసిన్ వాడుతున్నారా..? ఈ మహిళకు పట్టిన గతే మీకు పడుతుంది జాగ్రత్త..!!

జనరల్ గా చాలామందికి కొన్ని అలవాట్లు ఉంటాయి . ప్రతి చిన్న దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా..? అంటూ నిర్లక్ష్యం చేస్తూ జలుబుకి – తలనొప్పికి – బాడీపెయిన్స్ కు దగ్గు వచ్చినా ఏదో మనకు తెలిసిన టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు . మనలో చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారు . చిన్న జలుబేగా ..చిన్న తలనొప్పిగా ..పెద్ద ప్రాబ్లం కాదులే అంటూ ఏదో ఒక మెడిసిన్ వాడటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు డాక్టర్లు .

రీసెంట్గా ఒక మహిళ అలాగే చేసింది తనకు జలుబు దగ్గు రావడంతో తెలిసిన మందులను మెడికల్ షాప్ కి వెళ్లి తీసుకొని వాడింది . ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆమె తనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని మెడిసిన్స్ తీసుకొని వాడింది . ఆ మెడిసిన్స్ తీసుకున్న ఒక గంట కల్లా ఆమె ముఖం మొత్తం మారిపోయింది .. కళ్ళు ఎర్రగా అయిపోయి.. ముఖం పాము చర్మంల ముడతలు పడిపోయింది . పెదవులపై పసుపు పొర ఏర్పడి కళ్ళల్లో నుంచి బ్లడ్ కారడం మొదలైంది .

దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయిపోయారు . వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు . అయితే కొన్ని కొన్ని మెడిసిన్స్ కొన్ని కొన్ని బాడీస్ కు సూట్ అవ్వవు అని ..మరీ ముఖ్యంగా డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ..అలా వైద్యుల సలహా లేకుండా దేనిని తీసుకోకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న జలుబు అయినా సరే ప్రతిదానికి డాక్టర్ సలహా తీసుకోవాల్సిందేనని ..మనకు ఇష్టం వచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటే అది ఆరోగ్యం పై ఇంకా ఇంకా చెడు ప్రభావం చూపుతుందని చెప్పుకొస్తున్నారు.

కొందరికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది . అలాంటి వాళ్ళు హైడోస్ ఉన్న టాబ్లెట్స్ వేసుకుంటే చాలా చాలా ప్రమాదకరంగా మారుతుందని సూచిస్తున్నారు డాక్టర్లు . అంతేకాదు డాక్టర్లు సలహా లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి మెడిసిన్ వాడొద్దు అని సజెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!