నాని టాలీవుడ్ ఫేవరెట్ హీరోల లిస్ట్ ఇదే.. వాళ్లే ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్లలో నాని ఒకరు న్యాచురల్ స్టార్ గా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నాని.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. మన పక్కింట్లో ఉండే కుర్రాడు ఎలా మాట్లాడుతాడో అలాంటి సహజమైన నటనను అందించే నాని.. తన స్థానాన్ని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నానాడ‌డు నాని.

Waltair Veerayya on Netflix: Know streaming details of Chiranjeevi-Ravi  Teja's film – India TV

ఇందులో భాగంగా దసరా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాని తెలుగు ఫేవరెట్ హీరోలు ఎవరు అనే విషయం నెట్టింట వైరల్ గా మారింది. అయితే నాని కి ముగ్గురు స్టార్ హీరోస్ అంటే ఎంతో ఇష్టమట. అయితే వారు మాత్రమే ఎందుకు అంత స్పెషల్.. ఆ స్టార్ హీరోస్ ఎవరో ఒకసారి చూద్దాం. నాని ఫేవరెట్ యాక్టర్స్ అంతా కూడా ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తమ సొంత కష్టంతో ఎదిగిన వాళ్లే.

Nani opens up about response to Dasara, says 'it has been overwhelming' -  India Today

అలా సొంతకష్టంతో స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో చిరంజీవి ఒకరు. మొదట చిరంజీవి అంటే నానికి చాలా ఇష్టమట. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రవితేజ కూడా ఆయనకు ఫేవరెట్ హీరో అని.. నాని వివరించాడు. ఇంకొక హీరో మరెవరో కాదు.. నాని నే. ఆయనకు చిరంజీవి, రవితేజతో పాటు త‌ను అంటే కూడా అంతే ఇష్టమట. ఇలా వీరి ముగ్గురు తమ సొంత కష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎదిగారు. అందుకే వీళ్ళిద్దరూ నాని దృష్టిలో అంత స్పెషల్.