అంగరంగ వైభోగంగా అమలాపాల్ శ్రీమంతం.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు హీరోల సరసన తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

ఇక ఈ బ్యూటీ గత ఏడాది భరత్ దేశాయి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ ఐదు న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ అని ప్రకటించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ ప్రెగ్నెన్సీ పిరియడ్ ను ఎంజాయ్ చేస్తుంది.

ప్రెగ్నెన్సీ విషయం బయట పెట్టినప్పటి నుంచి ఈ బ్యూటీ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయడం మొదలుపెట్టింది. తాజాగా అమలాపాల్ తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఫాన్స్ కు షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడంతో.. కంగ్రాట్స్ చెబుతున్నారు ఫ్యాన్స్.