ఇక నుంచి అలాంటి సినిమాలు నేను చెయ్యను.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్జీవి..!

తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై మరియు సినీ సెలబ్రిటీలపై కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు ఆర్జీవి. వివాదాస్పదంగా మాట్లాడడంతో ఆయనకు ఆయనే పోటీ అని చెప్పుకోవచ్చు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని జనాలు భావిస్తారు. అమ్మాయిల తో రాసలీలలు కూడా నడుపుతూ ఉంటాడు ఆర్జీవి.

ఎవ్వరికి భయపడకుండా ఆ రాసలీలలను సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేస్తాడు. ఇక ఈ డైరెక్టర్కు శృంగారం అండ్ మద్యం సేవించడం అంటే ఇష్టమై ఓపెన్ గా చెప్తాడు. ఇక తాజాగా ఈయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి రాజకీయ నేపథ్య సినిమాలు తీయనని ప్రకటించాడు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తానని వెల్లడించాడు.

ఇందుకోసం యువర్ ఫిలిం అనే కాన్సెప్ట్ను ఆర్జీవి స్టార్ట్ చేశాడు. మూవీ కి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ టాలెంట్ను గుర్తించి వాళ్లతో మూవీని చేయిస్తామని.. క్రడ్ ఫండెడ్ ఆలోచన కూడా ఉందని ఆర్జీవి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.