పెళ్లయి నెల తిరగకముందే గుడ్ న్యూస్ షేర్ చేసిన బిగ్ బాస్ ప్రియాంక – శివకుమార్.. వీడియో..!

నటి ప్రియాంక మనందరికీ సుపరిచితమే. జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ షోలో టాప్ ఫైవ్ లో నలుగురు అబ్బాయిలతో పోటా పోటీగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. కానీ కప్ మాత్రం గెలుచుకోలేకపోయింది.

ఇక తాజాగా ప్రియాంక మరియు శివకుమార్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి నెల తిరగకముందే గుడ్ న్యూస్ ని షేర్ చేశారు. ఈ ఉగాది కి మేము కొత్త ఇల్లుని కొనుగోలు చేస్తున్నాము. మాకు ఓ ఇల్లు నచ్చింది. అది చూడడానికే ఇప్పుడు వెళ్తున్నాము. త్వరలోనే దాన్ని కొనుగోలు చేసి షిఫ్ట్ అవుతాము.

ఇకనుంచి మేము ఇద్దరం కొత్త ఇంట్లో ఉండబోతున్నాము అంటూ ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించింది. అలా పెళ్లై నెల తిరగకముందే ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసి తమ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచారు ఈ ఇద్దరు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.