మరో రికార్డ్ బ్రేక్ దిశగా వెళ్తున్న ” టిల్లు స్క్వేర్ “.. టిల్లు గాడి అమ్మాయిల ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందిగా..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు హీరోగా అనుపమ హీరోయిన్గా మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” టిల్లు స్క్వేర్ “. 2022లో విడుదలైన డిజే టిల్లు మూవీకి ఇది సీక్వెల్. ఇక భారీ అంచనాలతో ఈ సీక్వెల్ మార్చ్ 29న విడుదల భారీ కలెక్షన్స్ను రాబడుతుంది.

దాదాపు 100 కోట్ల గ్రాస్ని టచ్ చేస్తుంది ఈ మూవీ. అయితే యూఎస్ మార్కెట్లో మాత్రం టిల్లు హవా మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అక్కడ లేటెస్ట్ గా ఈ మూవీ రెండున్నర మిలియన్ డాలర్స్ గ్రాస్ ని కొల్లగొట్టి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతుంది.

ఇక ఈ స్పీడ్ లో ఈ మూవీ మరో సెన్సేషనల్ మార్క్ 3 మిలియన్ క్లబ్ లో జాయిన్ అవ్వడం కూడా కారారు అనిపిస్తుంది. దీంతో ఇది కంప్లీట్ అయితే యంగ్ హీరోస్ లో సిద్దు బాయ్ యూనిక్ రికార్డ్ అందుకున్న వాడిగా నిలుస్తాడని చెప్పాలి. మరి లాంగ్ రాన్లో యూఎస్ మార్కెట్లో ఈ మూవీ ఎటువంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.