మెగాస్టార్ కి బాగా నచ్చిన ఈ జనరేషన్ దర్శకులు వీళ్లే.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్‌లో దాదాపు 40 సంవత్సరాలుగా స్టార్ హీరోగా రాణిస్తూ.. మెగాస్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభ‌ర‌ సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఈ సినిమాతో తనని తాను మరోసారి కొత్త‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నాల‌లో ఉన్నాడ‌ట చిరు. 40 సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ ఎవరు ట‌చ్ చేయ‌లేని క్రేజ్ సంపాదించుకుని నెంబర్ వన్ పొజిషన్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికీ వ‌రుస సినిమాలు చేస్తు యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు.

Chiranjeevi cannot satisfy Rajamouli? | cinejosh.com

ఈ నేప‌ధ్యంలో ప్రస్తుత జ‌న‌రేష‌న్‌ దర్శకులలో చిరంజీవికి ఈ దర్శకులంటే చాలా ఇష్టమంటూ వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది డైరెక్టర్స్‌తో ప‌ని చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న చిరు.. త‌న‌కు మాత్రం ఈ జనరేషన్ లో ఉన్న ఆ డైరుక్ట‌ర్స్ అంద‌రిలో రాజమౌళి అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఎందుకంత స్పెష‌ల్ అంటే జ‌క్క‌న‌ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో విస్తరింప చేయడమే కాదు.. త‌న‌కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చ‌కున్నాడు.

Confirmed! VV Vinayak to wield the megaphone for Chiranjeevi's 'Lucifer'  remake | Telugu Movie News - Times of India

అందుకే నాకు రాజమౌళి అంటే చాలా అభామానం అంటూ వివ‌రించాడు. ఇక రాజమౌళి తో పాటు సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌ను స్టార్ట్ చేసిన వి.వి.వినాయక్ అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. దానికి కార‌ణం వి.వి. వినాయక్ చిరంజీవికి రెండు హిట్ సినిమాలను అందిచాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అయినా వాటిని కూడా చాలా సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్ది సక్సెస్ కొట్టడం సాధార‌ణ విష‌యం కాదు.. అలాంటిది సులువుగా ఆ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లని అందుకున్నాడు. అందుకే వినాయ‌క్ అంటే కూడా చాలా గౌరవం అంటూ వివ‌రించాడు.