రెమ్యూనరేషన్ భారీగా పెంచిన‌ మృణాల్.. అమ్మడి డిమాండ్ అట్లుంది..!!

బాలీవుడ్ సీరియల్స్ ద్వారా పాపులారిటీ ద‌క్కించుకున్ని అక్కడ సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంది మృణాల్ ఠాకూర్. తెలుగులో హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మొద‌టి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మ‌డు. టాలీవుడ్‌లో భారీ క్రేజ్ ద‌క్కించుకుంది. తర్వాత నాని.. హాయ్ నాన్న మూవీలో హీరోయిన్‌గా మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోడంతో మృణాల్ తెలుగులో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇటీవ‌ల‌ విజయ్ దేవరకొండ స‌ర‌స‌న‌ ఫ్యామిలీ స్టార్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Here are 10 looks of Mrunal Thakur from Sita Ramam that we adore |  Filmfare.com

సమ్మర్ కానుక‌గా తాజాగా ఈ సినిమా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ స్టార్ ఊభించిన రేంజ్‌లో స‌క్స‌స్‌ అందుకోలేదు. కాగా గ‌తంలో మృణాల్ న‌టించిన‌ సీతారామం, హాయ్ నాన్న రెండు సినిమాలు హిట్ పడగానే మృణాల్ తన రెమ్యునరేషన్‌ను పెంచేసింది ఈ అమ్మ‌డు. కాగా తాజాగా ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా ఇప్పుడు మళ్లీ తన రెమ్య‌న‌రేష‌న్‌ పెంచేసింద‌ట‌. ఫ్యామిలీ స్టార్ కోసం రూ.3 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న మృణాల్.. ఆ సినిమా తర్వాత రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్‌. అయితే అమ్మడు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ కూడా సిద్ధంగా ఉండ‌టం విశేషం.

Nandanandanaa from Vijay Deverakonda, Mrunal Thakur's Family Star is an  instant chartbuster, has lovely visuals

తెలుగులో నటించినవి 3 సినిమాలే అయినా వాటిలో రెండు మూవీలు మంచి హిట్లు అవ్వడంతో ఈ అమ్మ‌డి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు ఆడియ‌న్స్‌లో ఆమె లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఫ్యామిలీ స్టార్ తో మొదటి ఫెయిల్యూర్ ఫేస్ చేసిన మృణాల్ తన నెక్స్ట్ సినిమాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేయ‌నుంద‌ని టాక్‌. ఇక హను రాఘవపుడి, ప్రభాస్ కాంబోలోలో రానున్న సినిమాలో కూడా మృణాల్ హీరోయిన్‌గా నటిస్తుందని స‌మాచారం. సీతారామం హిట్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఫిక్స్ చేసుకున్న హను.. ప్రస్తుతం ఆ సినిమా కథ పూర్తి చేసే పనుల్లో బిజీగా గ‌డుపుతున్నాడు.