‘ దేవర ‘ ఆడియో, డిజిటల్ రైట్స్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థలు.. బ‌డ్జెట్ తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారి కూడా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించలేదు. దీంతో ఎప్పుడు ఎన్టీఆర్ సినిమా వెండితెరపై వస్తుందా అంటూ అభిమానులంతా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందడంతో.. వీరిద్దరు కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Audio rights of NTR's Devara bagged by this popular music label | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ను దక్కించుకున్నాడు అలాగే.. తాను తీయబోతున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌ను దేవర సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇందులో భాగంగా సినిమా మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

NTR Trends on X: "It's Official 🐯 #Devara - Part 1 All 5 Languages Digital Rights Sold For 155 Crores To @netflix 🔥 As Per Agreement, Gap Between Theatrical Release & OTT

కొద్ది నెలలు మాత్రమే గడువు ఉండడంతో సినిమా పనులను మెల్లమెల్లగా టీం పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ సినిమా యొక్క నార్త్ ఇండియా డిజిటల్ ఆడియో హక్కులను.. ప్రముఖ సంస్థలకు అమ్మివేసింది. తాజాగా ఈ న్యూస్‌ను యూనిట్ సభ్యులు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మూవీ మ్యూజిక్ హక్కులను టి సిరీస్ సంస్థ, డిజిటల్ ఓటిటి హక్కులను భారీ ధ‌ర‌కు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్ల‌కు డిజిట‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అఫీషియల్ గా ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింటి వైరల్ గా మారింది.