లక్షలు కాదు కోట్లు ఇచ్చిన విజయ్ దేవరకొండ సినిమాల్లో చేయనని చెప్పేసిన ఆ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?!

పెళ్లి చూపుల మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతో క్లాసికల్ హీట్ అందుకున్న ఈయన.. తర్వాత వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇక విజయ్‌ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు ఎప్పుడూ ఏదో ఒక్క కాంట్రవర్సీతో.. ట్రోల్స్ ను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ క్రమంలో తాను నటించే సినిమాల్లో ఒక యాటిట్యూడ్ ను కంటిన్యూ చేస్తూ రౌడీ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు.

Sai Pallavi rejected Vijay Deverakonda's Dear Comrade', here's why

అయితే ప్ర‌స్తుతం విజ‌య్ కు సంభందించిన ఓ న్యూస్ నిటింట వైర‌ల్‌గా మారింది. లక్షల్లో కాదు కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చిన సరే విజయ్ దేవరకొండ సినిమాల్లో మాత్రం నేను నటించిన అంటూ ఓ స్టార్ హీరోయిన్ సూటిగా చెప్పిందంటూ వార్తలు వైర‌ల్‌గా మారాయి. ఇంతకీ ఆమె ఎవరు.. రౌడీ స్టార్ సినిమాలో నటించిన అని చెప్పడానికి కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు ఫిదా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరో కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా ఈమె సొంతం చేసుకుంది.

Vijay Deverakonda | Vijay Deverakonda

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కథలో కంటెంట్ ఉందనిపిస్తేనే నటిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి స్టార్ హీరో సినిమా నైనా కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తూ వస్తుంది. అలా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమాలో మొదటి సాయి పల్లవికి హీరోయిన్గా అవకాశం వచ్చిందట. కానీ ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. త‌ర్వాత స‌మంతా న‌టించిన ఖుషి సినిమాలోను విజ‌య్‌కు జోడిగా అవ‌కాశం వ‌చ్చింద‌ని.. ఆ క్యారెక్టర్ ని కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. దీనికి కారణం విజయ్ దేవరకొండ సినిమాలు అంటే కచ్చితంగా కాంట్రవర్సీలు ఉంటాయి.. అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తుంది.. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించకూడదని ఫిక్స్ అయిందని తెలుస్తుంది.