పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ … ఏకంగా విజయ్ కే పోటీగా సవాల్..!

తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం పోటీ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ నమిత తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ” 2024 ఎన్నికలలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ పై పోటీ చేస్తాను. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థి పై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది.

అందుకే విజయ్ పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. విజయ్ కూడా రాజకీయాలలో రాణించాలని కోరుకుంటున్నాను ” అంటూ తెలిపింది నమిత. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. హీరో విజయ్ పై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఘోరంగా అవమానిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ కూడా రాజకీయాల్లో రాణించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సైతం తాజాగా సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లో రాణించేందుకు సిద్ధపడ్డాడు. ఇక ఇదే క్రమంలో నమిత కూడా ఈ దారిలోనే నడుస్తుంది.