RRR ను తలద్దన్నే సినిమా వచ్చేస్తుందోచ్.. హీరో ఎవరంటే..ఫుల్ డీటెయిల్స్ ఇవే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ను మించిపోయే రేంజ్ లో మరో సినిమా రాబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రణం రౌద్రం రుధిరం .. ఈ సినిమా పేరుతో రాజమౌళి భారీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కోట్లు కొల్లగొట్టింది . అంతేనా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా..? అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని సైతం ఇండియాకి తీసుకొచ్చింది.

ఇది కోట్లాదిమంది ఇండియన్స్ కల అన్న విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను మించిపోయే రేంజ్ లో కొత్త సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు మరి కొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. అని తెరకెక్కిస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఏ ఏ ఏ క్యాప్షన్ తో ఓ భారీ మూవీని తెరకెక్కించబోతున్నాడట .

ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది . అల్లు అర్జున్ – అట్లి -అనిరుధ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కబోతుందట . ఈ సినిమాకి నామకరణం కూడా ఫిక్స్ చేసుకున్నారట . దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష అలాగే సమంత నటించబోతున్నట్లు ఓ రూమర్ బాగా వైరల్ గా మారింది . ఈ సినిమా కచ్చితంగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!