చిరంజీవికి డ్యాన్స్ లో చుక్కలు చూపించిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఇప్పటికి ఆమె అంటే వణుకే..!!

మెగాస్టార్ చిరంజీవి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక హీరోగా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేసాడు . మరీ ముఖ్యంగా చిరంజీవి అనగానే అందరికీ గుర్తొచ్చేది డాన్స్ . ఎటువంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసేయగలడు . అస్సలు ప్రాక్టీస్ చేయకుండా కూడా చిరంజీవి డైరెక్ట్ అటెంప్ట్ తోనే ఒకే ఒక్క టేక్ చేసిన డాన్స్ మూమెంట్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి.

అయితే అలాంటి చిరంజీవికే డాన్సులో చుక్కలు చూపించింది ఒక స్టార్ హీరోయిన్ . ఈ విషయాన్ని స్వయాన మెగాస్టార్ చిరంజీవి గారే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు సమీరా రెడ్డి . బాలీవుడ్ హీరోయిన్ .. చిరంజీవి హీరోగా సమీరా రెడ్డి హీరోయిన్గా తెరకెక్కిన సినిమా జై చిరంజీవ . ఈ సినిమా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది . ఈ సినిమాకి సంబంధించిన ప్రతి న్యూస్ ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంటుంది.. అంటే దానికి కారణం సినిమా కాన్సెప్ట్ .

ఈ సినిమాలో చిరంజీవికి పోటీగా డాన్స్ చేసింది సమీరా రెడ్డి . మహా ముద్దొచ్చేస్తున్నావోయ్.. సాంగ్ లో చిరంజీవిని సైతం బీట్ చేసే రేంజ్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా స్టెప్స్ వేసింది . ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు చిరంజీవి. “నేను నా కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో వర్క్ చేశాను అని.. కానీ సమీరారెడ్డిలా నాతో టఫ్ గా డాన్స్ చేసిన హీరోయిన్ మాత్రం మరి ఎవ్వరు లేరు అని ..ఆమె స్టెప్స్ చూస్తే ఇప్పటికి నాకు షివరింగ్ వస్తుంది అని.. ఓపెన్ గా చెప్పుకొచ్చాడు “. అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా వైరల్ అయింది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మరోసారి అభిమానులు ఇదే వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!