“నా ప్రాణం ఉన్నంత వరకు అది ఎప్పటికి జరగదు”.. బోనీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..!

బోని కపూర్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ .. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ లోనూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా శ్రీదేవి భర్తగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు . బాలనాటిగా కెరియర్ ప్రారంభించిన శ్రీదేవి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తిరుగులేని స్టార్ డమ్ తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఊపు ఊపేసింది.

అందం అంటే శ్రీదేవి దే.. నటన అంటే శ్రీదేవి దే.. అసలు ఏ ఇండస్ట్రీ అయినా సరే ఆమె సినిమాలు రిలీజ్ కాకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోయేవి .ఆ రేంజ్ లో తన హవా కొనసాగించింది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది శ్రీదేవి. బాలీవుడ్ ని ఏలేసిన ఈ సౌత్ ఇండియన్ బ్యూటీ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం కూడా అందరికీ తెలుసు.

2018 ఫిబ్రవరి 24వ తేదీ దుబాయ్ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించింది . ఆమె మరణించి ఆరేళ్లు పైనే అవుతుంది.. అయినా సరే ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ ఇంకా వీడనే లేదు . అంత పెద్ద స్టార్ హీరోయిన్ కేవలం బాత్ టబ్లో ఎలా పడిపోయింది ..? అంతా అజాగ్రత్తగా ఉండిందా..? అసలు అప్పటివరకు శ్రీదేవి ఎప్పుడు కూడా బాత్రూంలో కాలు జారి కూడా పడలేదు ..? అంటూ ఫ్యాన్స్ రకరకాలుగా అనుమానించారు .

అయితే శ్రీదేవి బయోపిక్ రావాలి అంటూ ఫ్యాన్స్ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు . కానీ ఎందుకో తెలియదు బోనీకపూర్ మాత్రం ఒప్పుకోవడం లేదు . ఈ విషయాన్ని మరోసారి కన్ఫామ్ చేశాడు బోనీకపూర్. ఆయన నిర్మాతగా చేస్తున్న మూవీ మైదాన్. ఏప్రిల్ 10వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ ప్రమోషన్స్ లో భాగంగా బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్ గురించి స్పందించారు .

“శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్ .. ఆమె జీవితం ప్రైవేట్ గానే ఉండాలి .. నేను బ్రతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ కి అనుమతి ఇవ్వను “అంటూ చాలా చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. బోనీకపూర్ స్టేట్మెంట్ ఒకింత శ్రీదేవి అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి . ఎందుకు బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అనేది ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!