పబ్లిక్ లో బూతు పదం వాడిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో పై కోపంగా ఉన్న జనాలు(వీడియో) ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ..తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాంపేట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ .ఈ సినిమాపై జనాలకు ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే . ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను మంగళవారం చాలా గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్ .

ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది . మనకు తెలిసిందే ప్రతి ఈవెంట్ లోను విజయ్ దేవరకొండ చాలా స్టైలిష్ గా ట్రెండీగా కొత్త స్ట్రాటజీలను ఫాలో అవుతూ ఉంటారు . ఈసారి కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం సరికొత్త స్ట్రాటజీని ఫాలో అయ్యాడు . హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను బైక్ పై ఎక్కించుకొని రై రైయ్ అంటూ స్టేడియంలోకి అడుగు పెట్టాడు . ఇదే క్రమంలో బైక్ పై ఉన్న విజయ్ ఓ బూతు పదాన్ని వాడినట్లు ఓ వీడియో ఆధారంగా తెలుస్తుంది.

బైక్ పై వస్తున్న విజయ్ కి ఎదురుగా ఎవరో అడ్డుగా రావడంతో వెంటనే టంగ్ స్లిప్ అయిపోయి బూతు పదాన్ని వాడేసాడు రౌడీ హీరో. ఇది చూసిన నెటిజన్స్ అంత పెద్ద హీరోవి పబ్లిక్ లో అలాంటి బూతు పదాలు ఏంటి ..? అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు వేరే వాళ్ళు మాట్లాడితే విని వినన్నట్లు వెళ్ళిపోతారు అని.. విజయ్ దేవరకొండ మాట్లాడడం బట్టి ఇంత హైలెట్ చేస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు . కావాలనే విజయ్ దేవరకొండ పై బురద చల్లడానికి ఇలా చేస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండ ఫాన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!