తల్లికి ఇష్టమైన పాటతో మెస్మరైజ్ చేసిన సింగర్ సునీత…వైరల్ గా మారిన వీడియో..!

సింగర్ సునీత తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. గాయని గానే కాకుండా..డబ్బింగ్ ఆర్టిస్టు గా కూడా అలరించింది. ఆమె పాట విని మైమరచిపోని అభిమానులు లేరనడంలో ఏమాత్రం ఆసక్తి మోక్తి లేదు. తియ్యా టి స్వరం, చక్కని రూపం ఆమెకు దేవుడిచ్చిన వరంగా అభివర్ణిస్తుంటారు అభిమానులు, సినీ ప్రముఖులు.

తేట తెలుగు పాటలతో, తేనె లాంటి మాటలతో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సునీతకు 19 సంవత్సరాల వయసులోనే పెళ్లి అయింది. అయితే సునీతకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పలు కారణాలతో ఆమె తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ప్రముఖ బిజినెస్ మాన్ రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకుంది. వ్యక్తి జీవితంతో పాటు కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంది.

తన పర్సనల్ అండ్ ప్రోఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది సునీత. తాజాగా తన తల్లి పాదాలకు దగ్గరగా కూర్చుని, ఆమె ఒడిలో తలవాల్చుతూ ఉన్న ఒక వీడియోను షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ గా మారింది. వీడియో కింద అమ్మకు ఇష్టమైన పాట’ అనే క్యాప్షన్ ఇచ్చిన సునీత, తల్లి కోసం స్వయంగా ఒక మధురమైన పాట పాడి వినిపించింది. ఇది వింటున్న ఆ మాతృమూర్తి ఆనందంతో పరవశించిపోతుంది.