ప్రమాదానికి గురైన స్టార్ హీరో విజయ్.. గాయాలతో ఉన్న ఫొటోస్ వైరల్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే…’ ద గోట్ (గెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ‘ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేటందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే…తాజాగా విజయ్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈరోజు తమిళనాడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుండి స్టార్ట్ అయిన ఎన్నికల్లో ఓట్లు వేసేటందుకు కోలీవుడ్ స్టార్స్ సైతం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో విజయ్ దళపతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకునే టందుకు అక్కడికి వచ్చారు. అయితే..ఆయనను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఎందుకంటే..ఓటు వేయ్యడానికి వచ్చిన విజయ్ చేతికి గాయం ఉంది. ఇది గమనించిన అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు విజయ్కు ఏమై ముంటుంది అని ఆరా తీయగా..సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న సమాచారం మేరకు.. రష్యాలో బైక్ ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విజయ్ గాయపడినట్లు వినికిడి. ఈ కారణం చేతనే విజయ్ చాలా డల్ గా, బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.