బ్లాక్ లో టికెట్లు కొని మరి మహేశ్ బాబు చూసిన ఏకైక మూవీ ఇదే.. ఆ హీరో అంటే అంత పిచ్చా..?

వినడానికి ఆశ్చర్యంకరంగా ఉన్న .. ఇదేంట్రా బాబు.. మహేష్ బాబు ఇలా చేస్తాడా..? అని అనుకున్న ఇదే నిజం అంటున్నాడు మహేష్ బాబు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇప్పటికి ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు యంగ్ గర్ల్స్ మహేష్ బాబు లుక్స్ కి ఫిదా అవుతుంటారు . మహేష్ మా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు .

అలాంటి ఓరేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మహేష్ బాబు . మహేష్ బాబు స్టార్ హీరో కృష్ణ కొడుకు అన్న విషయం అందరికీ తెలుసు . ఆయన తలుచుకుంటే ఇంట్లోనే స్పెషల్ షోస్ వేయించుకొని సినిమా చూసే సత్తా ఉంది . కానీ మహేష్ బాబుకి అలాంటివి నచ్చవు ..నలుగురితో సినిమా చూడాలి …ఆ అరుపులు ఆ కేకలు ఆ ఎంజాయ్మెంట్ ఉంటేనే సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఆయన చెన్నైలో ఉండే మూమెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ అలాగే రజినీకాంత్ సినిమాలను బ్లాక్ లో టికెట్లు కొని మరి చూశాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

టికెట్లు అడిగితే ఎవరైనా తీస్తారు.. కానీ ఫ్యాన్స్ గా గుంపులో అరుస్తూ పేపర్లు ఎగరేస్తూ సినిమా చూస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది అని .. ఆ కారణంగానే నేను అలా సినిమాలు చూడడానికి ఇష్టపడతానని ..హైదరాబాద్లో ఆ వెసుల బాటు నాకు ఉండదు అని .. అందుకే చెన్నైకి వెళ్ళినప్పుడు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారి సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తాను అని.. కమల్ హాసన్ ..రజనీకాంత్ నటించిన సినిమాలను నేను బాగా లైక్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు రజనీకాంత్ నటించిన భాషా సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే . ఆ సినిమా కోసం టికెట్లు దొరక్క బ్లాక్ లో కొని మరి ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్పుకు రావడం గమనార్హం..!!