చీకట్లో ఆ హీరోయిన్ తో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన చిరంజీవి.. సడన్గా లైట్స్ ఆన్ అవ్వడంతో..!!

చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో శ్రమించి స్టార్ హీరోగా ఎదిగిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఈయన.. పట్టుదలతో శ్రమతో స్టార్ హీరోగా మారాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ నెంబర్ వ‌న్ హీరో స్థానాన్ని దక్కించుకున్నాడు. చిరంజీవి సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను క్రాస్ చేశాడు. ఆసక్తికర సంఘటనలు ఎన్నో ఆయన కెరీర్ లో ఉన్నాయి. ఇప్ప‌టికే పలు ఇంటర్వ్యూలో చిరంజీవి తన జర్నీలో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలా గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన శంకరాభరణం సినిమా చూసే సమయంలో బాగా కన్నీళ్లు పెట్టానని.. మూవీ క్లైమాక్స్‌లో అసలు కన్నీళ్లు ఆగలేదంటూ వివరించాడు.

ఈ సినిమాలో హీరోయిన్గా మంజు భార్గవి నటించిన సంగతి తెలిసిందే. ఆమె స్వయంగా చిరంజీవిని ప్రీమియర్ షో కి ఆహ్వానించిందట. గతంలో వీరిద్దరూ కోతల రాయుడు సినిమాలో కలిసి నటించారు.. ఆ ప‌రిచ‌యంతోనే చిరంజీవిని మంజు భార్గవి ఆహ్వానించిందట. ఆమె ఆహ్వానం మేరకు చిరంజీవి ఆషో చూడడానికి వెళ్లారు. అయితే అప్పటికి చిరంజీవి స్టార్ హీరోగా ఎదగలేదు. ఇక చిరుకు అప్పటికి కే. విశ్వనాథ్, నిర్మాత వేదిక నాగేశ్వరరావు అసలు పరిచయమే లేర‌ట. మంజు భార్గవి పక్కన కూర్చున్న ఆయన శంకరాభరణం క్లైమాక్స్ చూసి బాగా ఎమోషనల్ అయ్యారని.. కంటి నుండి నీరు ధారగా ధారగా కారుతున్నాయని.. ఎంత కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్లు ఆగలేదంటూ వివరించాడు.

చీకట్లో ఇది గమనించిన మంజు భార్గవి తన చీర కొంగు చిరంజీవికి ఇచ్చిందట. ఆమె కొంగు తీసుకుని చిరంజీవి కళ్ళు తుడుచుకుంటూ ఉండగా లైట్స్ ఆన్ అయ్యాయని.. మంజు భార్గవి చీర కొంగు చిరంజీవి చేతిలో ఉండడం అందరూ చూశి షాక్ అయ్యారని.. ఇక ఈ ప్రీమియర్ షో కి అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా వచ్చిందంటూ వివరించాడు. బహుశా సురేఖ కూడా ఇది చూసి ఉండవచ్చు.. అప్పటికి మాకు ఇంకా పెళ్లి కాలేదంటూ చిరంజీవి తన లైఫ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.