అక్కడ ఇండస్ట్రీలో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త మీనన్.. ఏం జరిగిందంటే..?!

స్టార్ హీరోయిన్ సంయుక్త మీన‌న్ ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వింవిసారా, నార్‌, విరూపాక్ష, డెవిల్ ఇలా వరుసగా 5 సూపర్ హిట్ సినిమాలను అందుకొని టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం నిఖిల్ స‌ర‌సన పాన్ ఇండియన్ మూవీ స్వయంభూతో ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది.

ఈ మూవీతో పాటు శ‌ర్వానంద్ కొత్త మూవీలోను ఈమె హీరోయిన్గా నటిస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ రిత్యా బాలీవుడ్ నుంచి కూడా మంచి అవకాశాలను అందుకుంటుందంటూ టాక్‌. హిందీలో ఓ పెద్ద ప్రాజెక్ట్ లో సంయుక్త మీనన్‌కు జాక్‌పాట్ ఆఫర్ తగిలింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సంయుక్త ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేందుకే ఆమె అక్కడికి వెళ్లిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌లో సంయుక్త వెళుతున్న పిక్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. త్వరలో సంయుక్త తన బాలీవుడ్ మూవీ ని అనౌన్స్ చేయబోతుందంటూ.. తెలుగుతో పాటు హిందీలో హీరోయిన్గా రాణించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ వైరల్ గా మారడంతో సంయుక్త ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈమె ఇంకా ఇలాంటి విజయాలను ఎన్నో అందుకోవాలని.. పాన్ ఇండియా లెవెల్లో సంయుక్తమీనన్‌కు మంచి గుర్తింపు రావాలంటూ కామెంట్స్‌లో త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేస్తున్నారు.