ఈ మ్యాజికల్ టానిక్ వారానికి ఒక్కసారి వాడితే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టినట్టే.. ?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉన్నారు. హెయిర్‌ గ్రోత్ లేకపోవడం.. డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వాటి నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు చెప్పబోయే టానిక్‌ మంచి ఫలితం ఇస్తుంది. వారానికి ఒక్కసారి ఈ టానిక్‌ వాడారంటే కచ్చితంగా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఇక‌ ఈ హెయిర్ టానిక్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాసు బియ్యం కడిగిన నీళ్లు పోసుకొని అది కాస్త మ‌రిగే అయ్యేవరకు వెయిట్ చేయాలి.

అందులో మూడు రెబ్బల కరివేపాకు.. రెండు టేబుల్ స్పూన్ల అవిస గింజలు.. ఒక టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ.. అలాగే అరకప్పు ఎండు గులాబీ రేఖలను వేసుకొని 15 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని వ‌డగట్టుకోవాలి. ఇక నీరు గోరువెచ్చ‌గా మారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే టానిక్ రెడీ అవుతుంది. ఈ హోం మేడ్‌ టానిక్ ఒక స్ప్రే బాటిల్ లో పోసుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుంటూ అప్లై చేసుకోవాలి.

గంట తర్వాత లైట్‌ షాంపును ఉపయోగించి హెడ్ బాత్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఈ టానిక్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. జుట్టును కుదుల నుంచి స్ట్రాంగ్ చేసి జుట్టు రాలడాన్ని అరికట్టుతుంది. దీంతో చుండ్రు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. అలాగే ఇందులో వాడే అవిసెగింజలు, విటమిన్ ఈ, స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్ డ్రై హెయిర్ సమస్యకు చెక్ పెడతాయి. జుట్టును హైడ్రేటెడ్‌గా.. మృదువుగా ఉంచుతాయి. కనుక మీ హెయిర్ హెల్తీగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ టానిక్ ను తప్పక ట్రై చేయండి.