ఈ ఫోటోలో ఉన్న ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు మిస్ చేసుకోరు..!!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్‌గా ఉంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ఆహారాలను తీసుకుంటూ డైట్ ఫాలో అవుతూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం కావాల్సిన పోషకాలను అందించే వాటిని కచ్చితంగా తినడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో పై ఫోటోలో కనిపిస్తున్న పండు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పండు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆ ఫ్రూట్ పేరు వాట‌ర్ చెస్ట్‌న‌ట్‌, సింఘాడ అని పిలుస్తూ ఉంటారు. ఈ పండు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో డిహైడ్రేట్ ప్రాబ్లంకి కూడా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ పండులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ, మ్యాంగనీస్ మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. దీంతో పాటు ఈ సింఘాడ పండులో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియ మెరుగుదలకు తోడ్పడుతుంది. మలబద్దక సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేందుకు.. పొటాషియం రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు హై బీపీ రోగులకు ఇది ఓ దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

దీన్ని తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. దంతాలు స్ట్రాంగ్ గా ఉండేందుకు కూడా ఈ పండు సహకరిస్తుంది. అలాగే ఇది తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగి ఆకలి వేయదు. కనుక బరువు తగ్గాలనుకునే వారు దీన్ని డైట్‌లో భాగం చేసుకుంటే చాలా మంచిది. తక్కువ క్యాలరీలు, ఫ్యాట్ ఉండడంతో ఫిట్నెస్ కు సహకరిస్తుంది. శరీర ఆరోగ్యానికి కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ పండు చాలా సహకరిస్తుంది. దీనిలో ఉండే లారీకి యాసిడ్ జుట్టు మూలాలను బలంగా ఉంచి హెయిర్ గ్రోత్ కు సహకరిస్తుంది. గతంలో చెప్పుకున్న కాలుష్యం, విటమిన్ సీ, జింగ్ లాంటి పోషకాలు జుట్టు, చర్మ ఆరోగ్య ని కాపాడేందుకు సహకరిస్తాయి. అంతే కాదు షుగర్ పేషెంట్లకు కూడా ఈ పండ్లు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి.