ఇండస్ట్రీలోకి వచ్చే “ముందు చిన్నదిగా.. వచ్చాక పెద్దదిగా”.. ఈ హీరోయిన్స్ లో వచ్చిన మార్పు గమనించారా..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చేది డబ్బు కోసం . విపరీతమైన డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు . దానికోసం చేయరాని త్యాగాలు పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది అని తెలిసిన అన్ని దిగమింగుకొని హీరోయిన్గా రావడానికి సిద్ధపడతారు . చాలామంది అదే కోవాలోకి వస్తారు . అయితే ఇండస్ట్రీలోకి రాకముందు తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చాక ఎక్కువ బ్యాంకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


సమంత : ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాకముందు తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ,,500 కూడా అకౌంట్ లో ఉండేటివి కావట . అదే ఇండస్ట్రీలోకి వచ్చాక కోట్ల బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది.


రకుల్ ప్రీత్ సింగ్ : వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాకముందు 1000 – 2000 పాకెట్ మనీగా తండ్రి వద్ద నుంచి తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదట. ఇప్పుడు రకుల్ ఖాతాలో కోట్లల్లోనే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది,

పూజా హెగ్డే : ముకుంద అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాకముందు చాలా తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదట . ఆ తర్వాత మాత్రం పూజ హెగ్డే కోట్లల్లోనే బ్యాంక్ బ్యాలెన్స్ ని రన్ చేస్తుంది. ఆశ్చర్యమేంటంటే చేతిలో పెద్దగా చెప్పుకో తగ్గ సినిమాలు లేకపోయినా సరే పూజా హెగ్డే అదే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం గమనార్హం.


ఇలియానా : దేవదాస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక్క రూపాయి కూడా సంపాదన ఉండేది కాదట. అసలు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదట . ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఆమె అకౌంట్ ఓపెన్ చేసుకోవడం డబ్బులు సంపాదించడం లాంటివి చేసిందట . ఇప్పుడు ఇలియానా ఖాతాలో కూడా బాగానే డబ్బులు మెయింటైన్ చేస్తుంది.


తమన్నా : ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పోపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలోకి రాకముందు పర్లేదు అనే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకునేది .అడపాదడపా మోడలింగ్ ఈవెంట్స్ లో పాల్గొని డబ్బులు సంపాదించుకునేది . కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో మెయిన్ టైన్ చేయడమే కాదు ఆమె వద్ద రెండు పెద్ద పెద్ద వజ్రాల మూఠలు కూడా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది..!!