మరో అమ్మాయితో ఎఫైర్.. ఏడాదంతా వరుస సమస్యలతో కృంగిపోయా.. భర్త పై స్నేహ షాకింగ్ కామెంట్స్..?!

అందం, అమాయకత్వం.. అభిన‌యంతో హోమ్లీ బ్యూటీగా భారీ పాపులారి దక్కించుకున్న ఒకప్పటి హీరోయిన్స్ స్నేహకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది. 2009లో అచ్చముందు అచ్చముందు అనే తమిళ సినిమాతో నటుడు ప్రసన్నతో జత‌ కట్టిన ఈ అమ్మడు ఆ టైంలో అతనితో ప్రేమలో పడి 2012లో వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కాగా పెళ్లి తర్వాత స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.

Inside Pictures From Sneha's Pongal Celebrations With Husband Prasanna And Kids. | Family photoshoot outfits, Family clothing sets, New saree designs

చ‌ర‌ణ్ న‌టించిన వినయ విధేయ రామతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాల్లో కీలకపాత్రలో నటించింది. ఇక తాజాగా చీరల బిజినెస్ లో దిగిన ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఆమె మాట్లాడుతూ పోసెసివ్‌నెస్ ఉండాలి కానీ.. అతిగా ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చింది. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేమని.. బయటకు ఎందుకు వెళ్తున్నావ్.. ఈ టైం లో ఏం చేయడానికి వెళ్తున్నావ్.. అలాంటి ప్రశ్నలు తలెత్తకూడదని.. అవతలి వ్యక్తి ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావని చెప్పుకొచ్చింది.

IN PICS Sneha Yellow saree Photos Sneha models for her own saree brand snehalaya silks | Sneha Saree Photos : சொந்த பிராண்டிற்கு மாடலிங் செய்து வரும் நடிகை சினேகா!

ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలంటూ మాట్లాడిన స్నేహ.. ఒకరు మనల్ని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకముందే నేను ఫలానా చోటుకు వెళుతున్న.. ఆ సమయంలోపు వచ్చేస్తా.. అని సమాచారం ఇవ్వాలని.. అక్కడికి వెళ్ళాక కూడా మీకు టైం ఉంటే ఒకసారి మీ భాగస్వామికి ఫోన్ చేసి నేను చేరుకున్న.. నువ్వు భోజనం చేసావా అనే ప్రశ్నలు అడిగితే ప్రేమ, నమ్మకం మరింత బలపడతాయని.. పెళ్లయిన కొత్తలో నేను కూడా పొసెసివ్ గా ఉండే దానిని అంటూ వివరించింది.

Celebrity Couple donate Rs 2 lakh for 10 Farmers

అయితే దాని అర్థం నాకు అతనిపై నమ్మకం లేదని కాదు. గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. దాంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ బ్రేకప్ జరగ‌కపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికే వాడే కాదు. అయితే అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చి పడడంతో ఆ ఏడాదంతా ఎంతో కష్టంగా గడిచింది. మానసిక ఒత్తిడికి లోనయ్యా.. సరిగ్గా అప్పుడే నేను ఉత్తమ నటిగా తమిళ్‌లో ఫిలిమ్ అవార్డు అందుకున్న అంటూ చెప్పుకొచ్చింది.