మిగతా హీరోయిన్స్ మూతి పగిలిపోయేలా ఆ విషయంలో బోల్డ్ నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్.. ఏం డేర్ రా బాబు..!

కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అఫ్కోర్స్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ అందంగా ఉంటారు . పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అభిమానుల కళ్ళల్లో పడుతూ ఉంటారు. అందులో ఒకరే ఈ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ . ఒకప్పుడు కాజల్ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయేవారో.. షర్ట్లు చించుకొని మరి అరిచేసేవారో మనకు తెలిసిందే .

బడా బడా స్టార్ హీరోలు కూడా కాజల్ మా సినిమాలో ఉండాల్సిందే అంటూ ఆమె కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసి .. ఆమెనే తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి . రీసెంట్గా కాజల్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరియర్ పీక్స్ లో ఉండగానే తన ఫ్రెండ్ గౌతమ్ కిచ్చులును పెళ్లి చేసుకుంది .

వెంటనే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది. సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ మరి ముఖ్యంగా స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఉన్న ఏ హీరోయిన్ కూడా అలా చేయదు .. టైం టేకింగ్ తీసుకుంటుంది . కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం త్వరగా బిడ్డను కన్నేసింది. బిడ్డలను కన్నాక ఆఫర్స్ రావు అని కెరియర్ నాశనం అయిపోతుంది అనే హీరోయిన్స్ మూతి పగిలిపోయేలా చెప్పకనే ఆన్సర్ చెప్పింది . సెకండ్ ఇన్నింగ్స్ లోను దూసుకుపోతుంది కాజల్ .. ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు హ్యాపీగా ఉన్నారు..!!