శేఖర్ మాస్టర్ ఇంట తివ్ర విషాదం.. ఈ వార్త జీర్ణించుకోలేకపోతున్న అంటూ ఎమోషనల్..?!

తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న ఈయన.. మొదటి టీవీ షో లతో కెరీర్ ప్రారంభించి తర్వాత సినిమాల్లోకి కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎంతమంది స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసే స్టేజ్కు ఎదిగాడు. స్వ‌యం కృషితో స‌క్స‌స్ అందుకున్న శేఖర్ మాస్టర్ ప్ర‌స్తుతం ఓవైపు వరుస సినిమాలకు కొరియోగ్రఫీ అవకాశాలను అద్దుకుంటూనే.. మరోవైపు తెలుగులో టెలికాస్ట్ అవుతున్న ఢీ లాంటి డ్యాన్స్ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నారు.

Google's Blunder On Dance Master Sekhar

ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా శేఖర్ మాస్టర్ వదిన చనిపోయారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శేఖర్ మాస్టర్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఇన్స్టా లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు. ఎంత బాధని అనుభవించిన ఎంతో ధైర్యంగా నిలబడ్డావ్.. ఐ మిస్ యూ వదిన.. నువ్వు నాకు ధైర్యాన్ని ఇచ్చి.. నాలో పాజిటివిటీ పెంచిన ఓ ఉన్న‌త మైన వ్య‌క్తి. నువ్వు లేవనే ఈ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్న అంటూ వివ‌రించాడు.

ఇప్పుడైనా స్వర్గంలో హ్యాపీగా ఉంటావని భావిస్తున్నా.. నువ్వు ఎప్పుడూ మావెంటే ఉంటావ్‌.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్నాడు. అయితే వదిన అని చెప్పిన ఆ వ్య‌క్తి తన భార్యకు అక్క అని తెలుస్తోంది. అయితే ఈమె చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం బయటకు రాలేదు. ఇక శేఖ‌ర్ మాస్ట‌ర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో శేఖర్ మాస్టర్‌ను ఓదారుస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.