హీరో, హీరోయిన్ కన్నా మీరే అందంగా ఉన్నారు… దిల్ రాజు పై కామెంట్స్ చేసిన లేడీ ఫ్యాన్స్..!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటీవలే గుంటూరు కారం సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈయన భారీ అపజయాన్ని వెలుగు చూశారు.

అయినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో దిల్ రాజు స్పెషల్ ఎట్రాక్టింగ్ గా నిలిచాడు.ఇక ఇటీవలే తన మేనల్లుడు ఆశిష్ తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాకి లవ్ మీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు కొన్ని ఆసక్తి గల వ్యాఖ్యలు కూడా చేశాడు.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియోలో దిల్ రాజు అక్కడ ఉన్న లేడీ ఫ్యాన్స్ తో మాట్లాడుతూ కనిపించాడు.ఈ క్రమంలోనే ఆ లేడీ ఫ్యాన్స్ హీరో మరియు హీరోయిన్ కంటే మీరే బాగున్నారు అంటూ దిల్ రాజు పై కామెంట్స్ చేశారు.దీనికి దిల్ రాజు సైతం నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.