తెలుగులో చేయట్లేదేం.. ఆఫర్లు రావడం లేదా.. విలేకరి ప్రశ్నకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన వెంకీ బ్యూటీ..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది రితికా సింగ్‌. నిజ జీవితంలో కిక్ బాక్సర్ అయిన ఈమె.. ఈ సినిమాలో కూడా బాక్సింగ్ చేస్తూ ఆకట్టుకుంది. తర్వాత నీవెవరో అనే సినిమాలో ఈమె నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక రితిక సింగ్ తర్వాత మరే తెలుగు సినిమాలోని నటించలేదు. అయితే తమిళ్, హిందీ ఇండ‌స్ట్రీల్లో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

చివ‌రిగా దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో మెరిసిన రితికా.. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేటయ్య సినిమాలో కీలక పాత్రలు నటిస్తోంది. అలాగే వళారి అనే హారర్ మూవీలోను నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవ‌ల గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ ఈవెంట్లో సందడి చేసిన రితికా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఇందులో భాగంగానే ఓ విలేఖరి ఆమెకు ఇబ్బంది కర ప్రశ్న సంధించాడు. ఎంతోమంది పరభాష కథానాయకలు టాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. మీరు మాత్రం తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదేం.. మీకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదా అంటూ ప్రశ్నించాడు.

దీనిపై రితిక స్పందిస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే అది ఎలాంటి సినిమా అయినా చేస్తా. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. మలయాళం, మరాఠీ, హిందీ అని భాషా భేదం నాకు లేదు. ఏ భాష అయినా నాకు కథ, పాత్ర ఇంపార్టెంట్. అవి రెండు సెట్ అవుతాయని భావిస్తేనే నేను సినిమాలకు ఒప్పుకుంటా అంటూ వివరించింది. ప్రస్తుతం రితికా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో.. కరెక్ట్ గా సమాధానం ఇచ్చారు.. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసే వారికి అలానే సమాధానం చెప్పాలి అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.