చిరంజీవితో ఆమని ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించక పోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలుగా క్రేజ్‌ సంపాదించుకున్నా చిరంజీవికి ఉండే క్రేజ్‌ వేరే లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అందుకునేవో అందరికీ తెలుసు. సాధారణ ప్రేక్షకుడిని మెప్పించడంలో చిరంజీవి సినిమాల తర్వాతే మరే ఇతర స్టార్ హీరోలు సినిమాలు అయినా అనేంతగా చిరంజీవి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఉండే ప్రతి యాక్టర్ చిరంజీవితో కలిసి నటించాలని.. ఆయనతో ఒక సినిమాలో ఆయన పనిచేయాలని కోరుకుంటూ ఉంటారు. డైరెక్టర్స్ కూడా చిరంజీవితో సినిమా చేసేందుకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక చిరంజీవితో సినిమా నటించే అవకాశం వస్తే హీరోయిన్స్ పండగ చేసుకుంటారు. అలా రంభ‌, రమ్యకృష్ణ, మీనా లాంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ మెగాస్టార్ తో న‌టించిన‌ తర్వాతే టాలీవుడ్ టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న జగపతిబాబు, శ్రీకాంత్, నాగార్జున లాంటి హీరోల అందరితో నటించి మెప్పించిన ఆమని.. చిరంజీవితో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉందట. అప్పట్లో ఆమనికి.. చిరంజీవితో ఓ సినిమా చేసే అవకాశం వచ్చిందని.. కానీ సినిమా ప్రొడ్యూసర్ చిరంజీవి పక్కన ఆమె హీరోయిన్గా అంతలా సెట్ అవ్వదు అంటూ తనని రిజెక్ట్ చేసి.. వేరే హీరోయిన్‌ను సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

దీంతో తన ఫేవరెట్ హీరో చిరంజీవి పక్కన ఆమని నటించే అవకాశాన్ని కోల్పోయిందట. చిరంజీవితో నటించవచ్చని ఎంత సంబరపడినట్లు ఆ అవకాశం చేజారిపోవడంతో.. బాధపడిందని తెలుస్తుంది. ఇక అప్పటినుంచి ఆమని కి చిరంజీవితో సినిమాలో చేసే అవకాశం రాకపోవడంతో.. ఆమె చాలా నిరాశ పడిందట. ఆమ‌నీకి ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ పరంగా ఏదైనా లోటు ఉంది అంటే అది చిరంజీవితో ఒక సినిమాలో కూడా చేయకపోవడమే అంటూ ఆమె ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో వివరించారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఫేమ్‌ సంపాదించుకున్న ఆమని ప్రస్తుతం పలు సినిమాల్లో మదర్ రోల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది.