ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఆ విషయంలో తారక్ నే మించిపోతున్నాడుగా..!

ఈ మధ్యకాలంలో సినిమాని ఎలా తెరకెక్కించామా..? అన్నది కాదు సినిమాని ఎలా ప్రమోట్ చేసామో ..?అన్నదే హైలెట్ గా మారుతుంది. మరి ముఖ్యంగా చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి సినిమాను తమదైన స్టైల్ లో ప్రమోట్ చేయడానికి కష్టపడుతున్నారు మేకర్స్. అంతేకాదు సినిమాకి డిఫరెంట్ టైటిల్ ఉంటే క్యాచీ పదాలు వాడితే ఆ సినిమా జనాలలోకి ఎక్కువగా వెళుతుంది అన్న ఉద్దేశం అందరికీ వస్తుంది .

రీసెంట్గా ఎన్టీఆర్ బామ్మర్ది సైతం అదే విధంగా ముందుకు వెళుతున్నాడు . ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరోగా పరిచయం అవుతూ మ్యాడ్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది . కలెక్షన్స్ పరంగా కూడా జనాలను బాగా సాటిస్ఫై చేసింది. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ లో బిజీ అవుతున్నాడు ఈ హీరో.

ఇప్పటికే శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమా అనౌన్స్ చేశారు . ఇప్పుడు తాజాగా మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా టైటిల్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి “ఆయ్ ..మేం ఫ్రెండ్స్ అండి” అనే క్యాప్షన్ కూడా పెట్టారు. టైటిల్ వినడానికి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. క్యాచీగా కూడా ఉంది . ఆ ఊత పదాన్ని బలే పట్టేసుకున్నాడు డైరెక్టర్ . ఈ చిత్రాన్ని బడనిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ రూపొందించబోతుంది . కొత్త దర్శకుడు అంజి కంచుపల్లి ఈ చిత్రాన్ని తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేయబోతున్నాడట. టైటిల్స్ విషయంలో ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బామ్మర్ది సైతం అదే విధంగా ముందుకు వెళ్తున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా టైటిల్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏ విధంగా హిట్ అందుకుంటాడో నార్నె నితిన్..!!