సాయి పల్లవి నోటి నుండి ఊహించని మాటలు.. షాక్ అవుతున్న అభిమానులు..!

సాయి పల్లవి .. ఈ మధ్యకాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గార్గి సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి సోషల్ మీడియాకి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది . ఆ టైంలో అమ్మడు సినిమాలు మానేస్తుంది అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే వాటికి చెక్ పెడుతూ సాయి పల్లవి తమిళ్లో తెలుగులో వరుసగా సినిమాలకు కమిట్ అవ్వడం ప్రారంభించింది .

అంతేకాదు ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ సినిమాలను సైతం ఓకే చేసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. రీసెంట్గా ఇంటర్వ్యూలో సాయి పల్లవి రెమ్యూనరేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. “హీరోయిన్స్ చాలామంది రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు అన్న వార్తలు వింటూ ఉంటాం..సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్లే మనకు డబ్బులు ఇస్తారు.. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా నటనపై ఉండాలి .. నేను ఎప్పుడూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయను ..నేను రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలి అంటే “..

“అది నేను చేయలేనటువంటి పాత్రైనా అయి ఉండాలి.. నాకు బాగా కష్టంగా అనిపించిన రోలైనా అయి ఉండాలి ..ఇప్పటివరకు ఇలాంటిది ఏదీ నాకు ఎదురవ్వలేదు.. నేను రెమ్యూనరేషన్ డిమాండ్ చేయను లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడని సాయి పల్లవి ఫస్ట్ టైమ్ స్పందించడంతో అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు. మరోపక్క ఆమెకున్న డెడికేషన్ కి ఫిదా అయిపోతున్నారు..!!