నాని ” సరిపోదా శనివారం ” మూవీ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లను మరోసారి దుమ్ము దులిపేందుకు సిద్ధమైపోయాడు గా..!

టాలీవుడ్ స్టార్ హీరో నాని ప్రస్తుతం నటిస్తున్న మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ పై నాని అభిమానంతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోను విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీకి ఎస్ జె సూర్య ఇచ్చిన వాయిస్ ఓవర్ డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆగస్ట్ 29న ఈ మూవీ ప్రేక్షకులు ముందుకి వచ్చేందుకు సిద్ధపడినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ఏకంగా ఐదు భాషల్లో విడుదల చెయ్యనున్నారు చిత్ర బృందం.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి నాని మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకి రానున్నాడు. హాయ్ నాన్న మూవీ అయితే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. మరి సరిపోదా శనివారం మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.