కీర్తి సురేష్ మిస్ చేసుకున్న..ఆ సూపర్ డూపర్ హిట్ ఐటెం సాంగ్ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేయడం సర్వసాధారణం ..కొందరు డబ్బు కోసం మరికొందరు క్రేజ్ కోసం .. మరి కొందరు టైంపాస్ కోసం ..కారణం ఏదైనా కావచ్చు ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రూల్ ..ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో చేయడానికి ఇష్టపడరు . అలాంటి వాళ్ళల్లో ఒకరే ఈ కీర్తి సురేష్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్.. తన కెరీర్లో ఎన్నో ఐటెం సాంగ్స్ మిస్ చేసుకుందట .

మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో జిగేలు రాణి సాంగ్లో డైరెక్టర్ సుకుమార్ కీర్తి సురేష్ ని హీరోయిన్గా చూపించాలి అంటూ ఆశపడ్డారట . కానీ ఆమె నో చెప్పిందట. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు అప్రోచ్ అయినా సరే సున్నితంగా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. అయితే ఈ పాత్ర రిజెక్ట్ చేయడం పట్ల ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్న రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం శాడ్ గా ఉన్నారు .

ప్రెసెంట్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది కీర్తి సురేష్. అంతేకాదు ఆమెకు తెలుగులోను అవకాశాలు వస్తున్న సరే కీర్తి సురేష్ తెలుగు సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తుంది. దానికి కారణం భోళా శంకర్ సినిమా ద్వారా ఆమె ఎదుర్కొన్న హ్యూజ్ నెగిటివిటీ . ఈ సినిమాలో చెల్లి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ పై జనాలు దారుణాతి దారుణంగా ట్రోలింగ్ చేశారు..!!