దేవత లాగా దర్శనమిచ్చిన శ్రీ లీల.. డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా…!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ శ్రీలీల గురించి మనందరికీ తెలిసిందే. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ధమాకాతో సూపర్ హిట్ విజయం సాధించింది. 2023లో మొత్తం శ్రీ లీల సినిమాలే ఉన్నాయంటే తన క్రేజ్ ఏ విధంగా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన శ్రీ లీల మిక్స్డ్ టాక్ దక్కించుకుంది.ఇక శ్రీ లీల చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్సర్ అన్న విషయం తెలిసిందే.అందువల్లే ఆమె ఏ సినిమాలో అయినా డాన్స్ ని అవలీలగా చేసేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ కార్యక్రమంలో క్లాసికల్ డాన్స్ చేసింది.

దాదాపు పది నిమిషాలు పాటు నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రస్తుతం శ్రీ లీల ఖాతాలో నాలుగు ఫ్లాప్స్ పడటంతో అవకాశాలు తగ్గాయి.ఈ క్రమంలోనే శ్రీ లీల తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. టాలీవుడ్ ని ఒకానొక సమయంలో షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ ఇండస్ట్రీని ఏ విధంగా షేక్ చేస్తుందో చూడాలి మరి.