ప్రభాస్ ” కల్కి ” మూవీ ట్రైలర్ లాంచ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!

పాన్ ఇండియా స్టార్ యాక్టర్స్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనకి తెలిసిందే.ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ట్రైలర్ మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారట మేకర్స్. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్,అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని,వీలు నటిస్తూ ఉండగా సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు.అలాగే వైజయంతి మూవీ వారునిర్మాణం వహించారు.

కల్కి 2898 AD మూవీ మే 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.ఇక ఇటీవలే ప్రభాస్ కి సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ 4 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఏ ఒక్కటి మంచి హిట్ అయినా ప్రభాస్ కి మరికొన్నిళ్లు ఇండస్ట్రీలో ఛాన్సెస్ వస్తాయని చెప్పొచ్చు. ఇక వీటిలో ప్రతి ఒక్కరి కన్ను కూడా కల్కి పైనే పడింది. ఇక కల్కి మూవీ నుంచి ఇప్పటికే అనేక లీకుల హడావిడి నడిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు కూడా. మరి ఇకపై ఇటువంటివి జరగకుండా మేకర్స్ చూసుకుంటారో లేదో చూడాలి మరి.