రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారడానికి కారణం..ఆ ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిటా..?

రాజమౌళి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు . మరీ ముఖ్యంగా మగధీర సినిమాతో తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టిన రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు . ఒకటి కాదు రెండు కాదు వేలకోట్ల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని టాప్ డైరెక్టర్గా ముందుకు దూసుకెళ్తున్నాడు .

రాజమౌళి ప్రెసిడెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు . ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు . అయితే రాజమౌళికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది . అన్ని విషయాలలో దీ పర్ఫెక్ట్ గా ఉండే రాజమౌళి ఒకే ఒక్క బ్యాడ్ హాబిట్ కారణంగా ఎప్పుడు స్టార్ హీరోస్ చేత నెగటివ్ కామెంట్స్ దక్కించుకుంటూ ఉంటాడు అన్న విషయం వైరల్ అవుతుంది.

రాజమౌళి కి పర్ఫెక్షన్ పిచ్చి ఏ సీన్ అయినా.. ఏ షూట్ అయినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటాడు . అది రెండు సెకండ్లు కనిపించే షాట్ అయినా సరే.. అన్ని అక్కడ క్లియర్ గా ఉండాలి అంటూ మొండి పట్టుదల ఉంటుంది . ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు . నాటు నాటు స్టెప్స్ విషయంలో మమ్మల్ని టార్చర్ చేశాడు అని .. ఫైనల్లీ ఆయన అనుకున్నదే సాధించాడు అని .. ఈయన ఓ పని పిచ్చోడు అని మొహమాటం లేకుండా చెప్పేసాడు. అంతేకాదు మిగతా స్టార్ హీరోలు కూడా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కు వత్తాసు పలికారు . రాజమౌళితో వర్క్ చేయడం కష్టమని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. ఆ ఒక్కటే రాజమౌళిలో బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని.. ఆ బాడ్ హ్యాబిట్ రాజమౌళిని స్టార్ట్ డైరెక్టర్ గా మార్చింది అని చెప్పుకొస్తున్నారు..!