“అర్ధ రాత్రుల్లు కాల్ చేసి టార్చర్ పెట్టేవాడు”.. టాలీవుడ్ యాంకర్ సెన్సేషనల్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఏడిపించడం.. ఆటపట్టించడం .. వేధించడం చాలా చాలా కామన్. అది ఏదైనా సరే లిమిట్స్ లో ఉంటే అన్ని బానే ఉంటాయి . లిమిట్స్ క్రాస్ చేస్తే ప్రతిదీ కూడా ఇబ్బందికరంగానే మారుతుంది . అలా ఇండస్ట్రీలో హద్దులు మీరిన ఓ కెమెరామెన్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది శ్యామల.

మొదట సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకుంది . పలు షోస్ కి యాంకరింగ్ కూడా చేసింది . ఫాస్ట్ గా కూడా తనదైన స్టైల్ లో మెప్పించింది . విరూపాక్ష సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ ఎంతలా ఆకట్టుకునిందో అందరికీ తెలిసిందే . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లోని చేదు విషయాలను కూడా బయట పెట్టింది. సీరియల్లో పనిచేస్తున్న టైం లో ఓ కెమెరామెన్ ఆమెను బాగా వేధించాడట.

మిడ్ నైట్ టైం లో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడే వారట . ఒకసారి ఆ ఫోన్ కాల్ వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేస్తే ..”మీకు మగదిక్కు లేదు నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను ” అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేసారట . ఆ తర్వాత శ్యామల కంప్లైంట్ ఇచ్చిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్యామల కూడా ఇంత టార్చర్ ఫెస్ చేసిందా ..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. కాగా యాంకర్ శ్యామల ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఈమెకి ఓ బాబు కూడా ఉన్నాడు . ప్రెసెంట్ పలు సినిమాలతో పలు షోస్ తో బిజీ బిజీగా ముందుకు వెళ్తూ యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ..!!