“ఇక పై వాటికి గుడ్ బై”..హీరోయిన్ తాప్సీ సంచలన నిర్ణయం..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఎలా యాక్టివ్గా ఉంటున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మల గురించి అయితే ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ తాప్సికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ తాప్సి అభిమానులకి బిగ్ షాక్ ఇవ్వబోతుంది అన్న ప్రచారం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతుంది.

హీరోయిన్ తాప్సి త్వరలోనే సోషల్ మీడియాకు పూర్తిగా దూరం కాబోతుందట .. ఉన్న విషయాన్ని చాలా బోల్డ్ గా మాట్లాడేసే హీరోయిన్ తాప్సి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది . అంతేకాదు త్వరలోనే తన ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ నానా ప్రచారం జరిగింది. ఆఫ్ కోర్స్ వాటి అన్నిటికి క్లారిటీ ఇచ్చినా..రీసెంట్ గా హీరోయిన్ తాప్సి ..

ఈ సోషల్ మీడియా హెడేక్ నుంచి బయటపడాలి అని అనుకుంటుందట . ఆ కారణం చేతనే ఈ సారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె తన సోషల్ మీడియా ఖాతా అన్నిటిని క్లోజ్ చేయబోతుందట. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అంటూ డిసైడ్ అయిందట . అంతేకాదు ఎటువంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదు అంటూ డిసైడ్ అయిందట..!!