ఈ పై ఫోటోలో బోసినవ్వులతో మెరిసిపోతున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఈమె పాన్ ఇండియన్ హీరోయిన్..?!

ఈ పై ఫోటోలో బూరి బుగ్గలతో.. బోసి నవ్వులు చిందిస్తూ మెరుస్తున్న‌ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, హిందీ అని భాషా బేధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకుంది ఈ కలువ కన్నుల చిన్నది. ప్రస్తుతానికి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా ఫాన్స్ మాత్రం అదే రేంజ్ లో ఆమెను అభిమానిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ప్రస్తుతం తన కూతురితో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ విషయాలను త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి ట్రీట్ ఇస్తుంది. ఇక కొద్దిరోజులుగా ఈ అమ్మడు ముద్దుల కూతురు ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? తను స్టార్ బ్యూటీ అసిన్. టాలీవుడ్ లోను ప‌లు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డంను సంపాదించింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న‌ అన్నవరం పన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ స‌ర‌సన చక్రం సినిమాల్లో నటించి ఆక‌ట్టుకుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన దశావతారం సినిమాలోను కింగ్ నాగార్జున న‌టించిన శివ‌మ‌ణిలోను నటించి ఆకట్టుకుంది. ఇక కోలీవుడ్ లో వచ్చిన గజినీ సినిమా తెలుగులో డబ్బింగ్ అవడంతో ఈ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాను హిందీలోనూ అమీర్ ఖాన్ రీమేక్ చేశారు.

సల్మాన్ ఖాన్, అక్షయ్ జోడిగా నటించిన ఈ సినిమా హిందీ పరిశ్రమంలోని భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇలా అని భాష‌లో న‌టించి పాన్ ఇండియ బ్యూటీగా మారిన అసిన్‌.. కాలేజీ రోజుల్లోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2001లో మలయాళ సినిమా నరేంద్ర మదన్ చేయకాంత్‌తో ఎంట్రీ ఇచ్చి ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ ఇలా వరుస భాషల్లో నటించింది. ఇక చివరిగా 2015లో రిలీజ్ అయిన ఆల్ ఈజ్ వెల్ సినిమాలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. 2016లో మైక్రోమ్యాక్స్ సెల్ ఫోన్ బిజినెస్‌ పార్ట‌న‌ర్‌ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. వీరికి అరిన్‌ అనే కుమార్తె ఉంది.