శివరాత్రి నాడు సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన ” కల్కి ” మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD.

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన దీపికా పదుకొనే, దిశాపటానీ లు హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నేడు శివరాత్రి సందర్భంగా మేకర్స్‌ సరికొత్త అప్డేట్ కి రెడీ అయిపోయారు. ఈ సినిమాలో హీరో నేమ్ పై అప్డేట్ ను నేడు ఇవ్వనున్నారు.

నేడు సాయంత్రం 5:00 గంటలకు రిలీజ్ చేయనున్నారు.ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ విడుదల చేశారు.మరి ఆ పోస్టర్లో శివలింగం ఆకట్టుకుంటుంది.సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్ ,కమల్ హాసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.