ఆసుపత్రి పాలైన నటుడు.. క్లారిటీ..!

కోలీవుడ్ స్టార్ హీరో అయినా అజిత్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన కోలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకున్నాడు.ఇక ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.స్టార్ హీరో అజిత్ ఆరోగ్యం పై సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.

అభిమానులు , ఫ్యాన్స్ ఈయ‌న‌ ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు.ఎట్టకేలకు అజిత్ కుమార్ ఆరోగ్యం పై ఒక క్లారిటీ వచ్చింది. రెగ్యులర్ కంప్లీట్ హైల్ చెక్ ఆప్ తో పాటుగా,కార్డియో మరియు న్యూరో చెకప్ కూడా చేయించుకున్నారు అజిత్. ఇక తాజాగా అజిత్ తన ఫ్యాన్స్ కి ధైర్యం చెబుతూ ఓ వీడియోని షేర్ చేశాడు. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉన్నట్లు వెల్లడించాడు.

అజిత్ కుమార్ ప్రస్తుతం విడా ముమార్చి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం కోసం ఆడియెన్స్ , ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రం కి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో అజర్ బైజాన్ ప్రాంతం లో స్టార్ట్ కానుంది.ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.