బన్నీ అంటే ఇష్టం లేక..జూలాయి సినిమాలో సోనూసూద్ పాత్ర మిస్ చేసుకున్న ఆ హీరో ఇతడే..!

జులాయి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకేక్కిన వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ అనే చెప్పాలి . ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా సరే తనవి తీరదు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా పాటలు ..అబ్బ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది . అల్లు అర్జున్ ఈ రేంజ్ లో దూసుకుపోవడానికి కారణం జులాయి సినిమా అని చెప్పక తప్పదు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంత బాగా పబ్లిసిటీ సంపాదించుకుందో అంతకు డబల్ రేంజ్ లో సోనోసూద్ క్యారెక్టర్ కూడా జనాల్లోకి ఎక్కేసింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ముందుగా ఈ పాత్ర కోసం అక్కినేని సుమంత్ ను అప్రోచ్ అయ్యారట . అయితే అక్కినేని సుమంత్ ఈ సినిమాలో నటించడానికి ఇష్టపడలేదట . విలన్ పాత్రలో నటించడానికి అస్సలు ఇష్టపడలేదట .

పైగా అల్లు అర్జున్ లాంటి టాప్ హీరో సినిమాలో విలన్ గా నటిస్తే ఇక ఆయన కెరియర్ ఢమాల్ అవుతుంది అన్న భయంతో ఈ పాత్రను రిజెక్ట్ చేశాడట. కొంతమంది అల్లు అర్జున్ అంటే ఇష్టం లేకనే ఆయన ఈ పాత్రను రిజెక్ట్ చేశారు అంటూ అప్పట్లో ప్రచారం చేశారు . కానీ ఈ సినిమా ద్వారా ఎంత మంచి పాపులారిటీ పబ్లిసిటీ సంపాదించుకున్నాడో మన అందరికీ తెలిసిందే..!!