సింపుల్ చీర కట్టులో అందాలను ఆరబోసిన మీనాక్షి చౌదరి.. ఆకట్టుకుంటున్న ఫొటోస్..!

టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న మీనాక్షి చౌదరి గురించి మనందరికీ తెలిసిందే .ఈమె టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరికి మిక్స్డ్ టాక్ అందింది.

ఇండస్ట్రీ లోకి వచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి.ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లెటెస్ట్ క్రష్ గా మారిపోయింది. ఇక‌ వరస సినిమాలతో బిజీగా ఉంటున్న మీనాక్షి .. సోషల్ మీడియా వేదిక అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది.అంతేకాకుండా తన అందంతో అబ్బాయిలను షాక్‌ అయ్యేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె సన్ సెట్ లో దిగిన ఫోటోలు అత్యంత అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ “..ఒక మంచి పుస్తకం,ఒక కప్పు చాయ్ … అద్భుతమైన కాంబో ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది మీనాక్షి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఏం అందం రా బాబు.. ఈ అందా అన్న గుంటూరు కారం మూవీలో సైడ్ క్యారెక్టర్ కింద పెట్టింది.. అంటూ కామెంట్ పెడుతున్నారు నెటిజన్స్.